అమ్మా అని పిలవంగానే నేను ఎందుకు సంతోష పడుతున్నాను ??
అమ్మా ఎత్తు కొమ్మా అనగానే చేసే పనంతా వదిలేసి మరీ ఎందుకు వెళ్ళిపోతున్నాను ??
అమ్మా ఆయోచింది అని ఏడుస్తుంటే నా మనసు ఎందుకు తట్టుకోలేకపోతోంది ??
అమ్మా ఆడుకుందాం రామ్మా అని పిలిచిన నా చిట్టి తల్లి తో నేనెందుకు వెళుతున్నాను ??
అమ్మా అని సంతోషం గా వచ్చి నన్ను పట్టుకోగానే నా కళ్ళల్లో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి??
తను ఒక్క రోజైన సరిగ్గా అన్నం తినక పోతే నా మనసు ఎందుకు బాధపడుతోంది ??
తనకి జ్వరం వస్తే నేనెందుకు ఆరాటపడుతున్నాను తగ్గించడానికి ??
తనని బడికి పంపుతున్నప్పుడు నా మనసు ఎందుకు బాధ పడుతోంది తన అమాయక మొహం చూసి ??
తనకి దెబ్బ తగిలితే నా మనసెందుకు రోధిస్తోంది ??
తను నిదురపోతున్న వేళ తనని చుసిన నా కళ్ళు ఎందుకు చెమ్మ గిల్లుతున్నాయి ??
తను చేసే అల్లరి చూసి నేనెందుకు మురిసి పోతున్నాను ??
తను అమ్మా నువ్వొద్దు అని నానమ్మ తో నో అమ్మమ్మ తోనో వెళ్ళుతుంటే నేనెందుకు బిక్కమొహం తో బాధగా చూస్తున్నాను ??
తన నవ్వు నాకోసమే అని ఎందుకనిపిస్తోంది ??
తన నవ్వు తో ఎంత కష్టాన్నైనా ఎలాగ మర్చిపో గలుగుతున్న??
తనకి ఈ ప్రపంచం లో దేనినైన సరే తెచ్చిద్దాం అని ఎందుకనిపిస్తోంది ??
ఒక్కో సారి ఏమీ చేయలేని నా అసమర్ధత ని నేనెందుకు తిట్టుకుంటాను తనకి ఒంట్లో బాగాలేకపోతే ??
నా ఈ మనోభావాలకి ఆంతర్యం ఏమిటి ??
ఓ ఇదేనా అమ్మతనం అంటే ??
అమ్మతనం లో ఉన్న కమ్మదనం అంటే ??
అవును నేను అమ్మ గా మళ్ళి పుట్టాను.... అమ్మ అని తను ఎప్పుడు పిలిచినా నాకు అదో కొత్త అనుభూతే !!!
ఈ కమ్మదనం ని ఆస్వాదిస్తున్న అందరి తల్లులకు ముఖ్యం గా నా తల్లి కి ఇది అంకితం !!!
MOTHER'S DAY సందర్భంగా !!
No comments:
Post a Comment