కారణం ఏమిటి?? చెప్పగలరా ఎవరైనా ??
ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతోంది ?? మానవత్వం ఏమయిపోతోంది? మనుషులు
జంతువుల కంటే హీనంగా ఎందుకు తయారవుతున్నారు?? ఇదేనా మనం సంపాదించిన
విజ్ఞానం ? బహుశా కలియుగాంతం వచ్చేసిందేమో??ఏమిటి ఈ ప్రశ్నల పరంపర అంటే దానికి సమాధానం ఈ రోజుల్లో జరుగుతున్న దారుణమైన సంఘటనలే !!
ఒక అమ్మాయిని దారుణం గా ఒక బస్సు లో గ్యాంగ్ రేప్ చేసారని విని, వాళ్ళు ఎంత దారుణం గా ఆ అమ్మాయిని వేధించారో
టీవీ లోనూ న్యూస్పేపర్ లోనూ చూసి మనుషులంటే ఇంత దారుణం గా కూడా ఉంటారా?
అనిపించేసింది . ఎంత చదువు లేక పోయినా మనిషికి కాస్త తెలివి అనేది ఉంది కదా?
అదే కదా మనకి పశువులకి మధ్య తేడ ! అలాంటిది మనిషి ఆ తెలివి ని మరచి ఒక
పశువు లాగ (బహుశా పశువులు కూడా అసహ్యించు కుంటాయేమో ??) ఇంత క్రురం గా ఎలా
మారిపోయాడు??
ఇంకా ఆ సంఘటన మనసులో నుండి చెదరక ముందే మరొక సంఘటన అదీ
ఒక 5 సం చిన్నారిది ! చిన్న పిల్లలు దేవుడితో సమానం అని మనమందరం నమ్ముతాం .
వాళ్ళ అమాయకత్వం కానీ, వాళ్ళ అల్లరి కానీ , వాళ్ళ కబుర్లు కానీ, చేతలు
కానీ ఎలాంటి బాధనైనా దూరం చేస్తుంది ,ఎవరి కైనా, ఎంత కష్టాల్లో ఉన్నా సరే!!
అలాంటిది ఒక చిన్నారిని ఎలా? ఎలా?ఎలా?
ఆ పసి హృదయం రేపు
కోలుకొని మళ్ళా మాములుగా తిరగ గలుగుతుందా ? శరీరం కి తగిలిన గాయాలు
మానిపోవచ్చు కానీ ఆ పసి హృదయం మాటేంటి ? ఆ గాయం మానడానికి ఈ జీవితం మొత్తం
పడుతుంది అంటే ఒప్పుకుంటారా? ఆ పాప కి మనుషులంటే నమ్మకం ఉంటుందా? ఆ భయం
పోతుందా?
అయితే దీనికి కారణం ఎవరు?ఎవరు?ఎవరు? అని ఎంత ఆలోచించినా దొరకని సమాధానం!! మద్యం
సేవించి ఆ మత్తులో తెలివి ని కోల్పోయినందుకు మద్యం కారణమా ? లేక ఫోన్ ఫోనులో
ఇబ్బందికరమైన దృశ్యాలు చూపించిన ఈ టెక్నాలజీదా ? లేక ఆ సైట్ దా ? అదీ
కాకపోతే పాపం ఆ చిన్నపిల్ల ఇంటి ముందే కదా ఆడుకుంటోం దని వదిలిన వాళ్ళ అమ్మదా?అదీ కాకపోతే కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే స్పందించని అధికారులదా ? ఆ పశువులని దొరికిన వెంటనే ఉరి తియ్యని ఈ ప్రభుత్వానిదా?
ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని నిలదియ్యాలి?
ఇదివరకు ఒక వయసు వచ్చాక జాగ్రతలు చెప్పేవారు తల్లిదండ్రులు.
బయటకి పంపడానికి కూడా ఇష్టపడేవారు కాదు. మరి ఇప్పుడు కనీసం 5సం పాపని కూడా
వదలని ఈ కిరాతకుల గురించి ఏమని వివరించాలి? అంటే ఇంకా ఆడపిల్ల కి స్వేచ్చ
లేదా ? జీవితమంతా భయంగానే గడపాలా ? అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో
ఎలా తెలుసుకోవాలి? పక్కింట్లో ఉన్న సుబ్బారావు కావచ్చు ఎదురింట్లో ఉన్న
పుల్లారావు కావచ్చు .ఆ కిరాతకుడు మన పక్కనే ఉండచ్చు. ఆడ పిల్లల తల్లులు
వారిని ఎలా కాపాడుకోవాలి? ఎంత వరకు కాపాడుకోగలరు?అసలు బయటకి పంపగలరా?
అలాగని ఇంట్లో నే బంధించగలరా ? దయచేసి ఎవరన్నా చెప్పండి !!
చెప్పగలరా ఎవరైనా??
అసలు దీనికి సమాధానముoదా ?
ఒక తల్లి గా నా ఆవేదన ఎవరికి అర్ధమవుతుంది?
No comments:
Post a Comment